Best Teacher | కేజీబీవీ పీజీ సిఆర్ టి సునీతకు ఉత్తమ అవార్డు

Best Teacher | కేజీబీవీ పీజీ సిఆర్ టి సునీతకు ఉత్తమ అవార్డు
Best Teacher | కడెం, ( నిర్మల్ జిల్లా ), ఆంధ్రప్రభ : సావిత్రిబాయి పూలే జయంతి సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా (Women) ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఉత్తమ ఉపాధ్యాయ గా ఎంపిక అయిన ఆమెను నిర్మల్ జిల్లా కలెక్టరు సన్మానించారు . అందులో భాగంగా కడెం కేజీబీవీ పాఠశాలలో పీజీ సి ఆర్ టి (ఎకనామిక్స్)గా విధులు నిర్వహిస్తున్న ఆర్ సునీతకు ఉత్తమ పిజిసిఆర్ టి అవార్డును నిర్మల్ జిల్లా కలెక్టరు అభిలాష అభినవ్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ నిర్మల్ డి ఈ ఓ భోజన్న నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి లు ప్రదానం చేశారు.
