సబ్ కలెక్టర్ ఆస్ప‌త్రి ప‌రిశీల‌న‌

బూర్గంపాడు, ఆంధ్ర‌ప్ర‌భ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఈ రోజు భద్రాచలం సబ్ కలెక్టర్ (Sub Collector ) మృనాల్ శ్రేష్ఠ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి ఓపీ రూము, పేషెంట్లకు సరిపడా బెడ్లు అందుతున్న వైద్యం, మంచినీటి సౌకర్యం, వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, ప్రతిరోజూ రోగుల సంఖ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మండల కేంద్రంలో చుట్టుపక్క గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందాలని, 108 అంబులెన్స్ సౌకర్యం, సరిపడా మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాల‌ని శ్రేష్ఠ సూచించారు. సిబ్బందిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె బీపీ చెక్ చేయించుకున్నారు. ఆస్ప‌త్రిలో ఆమె రక్త పరీక్షలు చేయించుకున్నారు.

Leave a Reply