ఎమ్మెల్యే బీఎల్ఆర్ ను కలిసిన బీసీలు..

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకూరు బాలు సతీమణి సుధా కు ఇవ్వాలని కోరుతూ ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని సుమారు వెయ్యిమంది బీసీలు.. పలు వార్డుల కౌన్సిలర్లు ఎమ్మెల్యే బీఎల్ఆర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గడిచిన మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న చిలుకూరు సుధాబాలు కు చైర్మన్ గా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీసీలకు ప్రాతినిధ్యం లేనందున ఈసారి కచ్చితంగా మున్సిపల్ చైర్మన్ గా బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీలకు అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉండదని హెచ్చరించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో సుమారు వెయ్యి మంది బీసీలు భారీగా ర్యాలీ నిర్వహించారు.

