పరిమిత ఓవర్ల సిరీస్ ల కోసం భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆగస్టు 17 నుంచి 31 వరకు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీ్‌సలు జరుగనున్నాయి. అలాగే బంగ్లాదేశ్ గడ్డపై టీ20 సిరీస్ ఆడడం భారత్‌కిదే మొదటిసారి.
మొత్తం 6 మ్యాచ్‌లు మీర్పూ ర్, చట్టోగ్రామ్‌లో నిర్వహించనున్నారు. మరోవైపు ఈ సిరీస్ కంటే ముందు జూన్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌తో 5 టెస్టులు ఆడనుంది. ఈనేపథ్యంలో యువ ఆటగాళ్లకు బంగ్లాతో సిరీస్‌ల్లో ఆడే అవకాశం రావచ్చు. ఇక రెండు జట్లు గతేడాది చివరిసారిగా తలపడినప్పుడు టెస్టు సిరీ్‌సను 2-0తో, టీ20 సిరీ్‌సను 3-0తో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.