ఐపీఎల్ 2025 జట్లకు బీబీసీఐ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల ఓనర్లు, ఆటగాళ్లు, కోచ్‌లు, కామెంటేటర్లను, సిబ్బందిని ఫిక్సింగ్‌లోకి దించే పనిలో పడ్డారని… అన్ని జట్లు, ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ పేర్కొంది.
ఆ వ్యాపారవేత్తకు అనేకమంది బుకీలతో సంబంధాలు ఉన్నాయని, అతను ఏ జట్టు ఓనర్లనైనా.. ఆటగాళ్లనైనా సంప్రదిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని బీసీసీఐ ఆదేశించింది.