BC ‘s Dharna| ఢిల్లీలో ప్రారంభమైన బిసి పోరు గర్జన ..

న్యూ ఢిల్లీ – విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. బీసీ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులను పార్లమెంట్‌ ఆమోదించి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగానే న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నేడి ఉదయం బీసీల పోరు గర్జన ప్రారంభమైంది.. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు1500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.. అలాగే బీసీల పోరు గర్జనకు కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సహా బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్కు చెందిన బీసీ నేతలు కూడా ధర్నాలో పాలు పంచుకుంటున్నారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎన్ సి పి శరద్ పవార్ గ్రూప్ ఎంపి సుప్రియా సూలే తో పాలు 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

బిజెపి దూరం..

బీసీ పోరు గర్జన సభకు బీజేపీ, దూరంగా ఉంది ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా.. బీజేపీ నుంచి ముఖ్య నేతలు ఎవరూ ఢిల్లీకి వెళ్లలేదు. ఇక బీసీ పోరుగర్జనకు తాము హాజరుకాలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లు బీసీ సంఘాల నేతలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *