Basrara IIIT : సీట్లు వందల్లో – దరఖాస్తులు వేలలో

బాసర జూన్ 22 (ఆంధ్ర ప్రభ) ఆర్జీయూకేటీ యూనివర్సిటీ బాసర మహబూబ్ నగర్ కేంద్రాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరు సంవత్సరల ఇంటిగ్రేటెడ్ బి టెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ముగిసిందని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు

. బాసర 1500,మహబూబ్ నగర్ 180 సీట్లకు 20258 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ, దరఖాస్తుల పరిశీలన అనంతరం జూలై 4వ ఎంపిక జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. జూలై 7వ తేదీ నుండి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రవేశాల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని వీసీ తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

Leave a Reply