Bapatla | ప్రజలకు మెరుగైన వైద్యమే లక్ష్యం
- మంత్రి సత్యకుమార్ యాదవ్

Bapatla | బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం (Government) కృషి చేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సంతమాగులూరు మండలం సంతమాగులూరు గ్రామంలో రూ.1.65కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ (Collector) డాక్టర్ వినోద్ కుమార్.వి తో కలిసి ఈ రోజు ఆయన ప్రారంభించారు. అలాగే ఆరు పడకల ఆసుపత్రి భవనం ప్రారంభ సూచికగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. నూతన భవనంలో ఏర్పాటుచేసిన సౌకర్యాలు, వైద్య సదుపాయాలను పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, చీరాల ఆర్డీవో టి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


