Bank | అఖిల భారత బ్యాంక్ సమ్మె జనవరి 27, 2026

Bank | అఖిల భారత బ్యాంక్ సమ్మె జనవరి 27, 2026

Bank | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : 9 బ్యాంక్ యూనియన్ల సమాఖ్య అయిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU), జనవరి 27, 2026న అఖిల భారత బ్యాంక్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) మరియు సహకార బ్యాంకులకు చెందిన సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు మరియు అధికారులు ee sammelO పాల్గొంటున్నారు.

సమ్మెకు గల ప్రధాన డిమాండ్ :

బ్యాంకింగ్ పరిశ్రమలో 5 రోజుల పని వారం (5 Day Work Week) అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలపాలి. ప్రస్తుతం సెలవులుగా ఉన్న 2వ మరియు 4వ శనివారాలతో పాటు, మిగిలిన అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాలి. డిసెంబర్ 2023 మరియు మార్చి 2024లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మరియు UFBU మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం దీనిని వెంటనే అమలు చేయాలి.

నేపథ్యం

2015 నాటి ఒప్పందం ప్రకారం నెలలో రెండు శనివారాలు సెలవులుగా ప్రకటించారు. ఆ సమయంలో మిగిలిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
2023లో జరిగిన చర్చల్లో, సోమవారం నుండి శుక్రవారం వరకు రోజువారీ పనివేళలను 40 నిమిషాలు పెంచడం ద్వారా అన్ని శనివారాలను సెలవులుగా మార్చడానికి అంగీకారం కుదిరింది.
ఈ ప్రతిపాదన గత రెండేళ్లుగా ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూస్తోంది. మార్చి 2025లో చేయాల్సిన సమ్మెను ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాయిదా వేసినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు.

సమ్మెకు కారణాలు

Bank |

RBI, LIC, GIC వంటి ఆర్థిక సంస్థల్లో ఇప్పటికే 5 రోజుల పని విధానం అమల్లో ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మరియు స్టాక్ ఎక్స్చేంజీలు కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే పని చేస్తాయి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, శనివారాలు సెలవు ఇవ్వడం వల్ల కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగదు.

తమను మాత్రమే వివక్షకు గురి చేస్తున్నారనే అసంతృప్తితో బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమయ్యారు.
ఈ సమ్మె కారణంగా బ్యాంకు వినియోగదారులకు కలిగే అసౌకర్యానికి ఉద్యోగ సంఘాలు చింతిస్తున్నాయి మరియు ప్రజలు సహకరించాలని కోరుతున్నాయి.

Leave a Reply