సేవాలాల్ జయంతికి తరలి వెళ్లిన బంజారా భక్తులు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగే బంజారాలా ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలకు ఉట్నూర్ మండలం కొత్తగూడ నుండి సేవాలాల్ భక్తులు ఆదిలాబాద్ కు బస్సులలో భారీగా తరలి వెళ్లారు. తరలి వెళ్లిన వారిలో జైనురు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భానోత్ జైవంతరావు, గ్రామ నాయక్ భక్తులు బంజారా ప్రజలు తరలి వెళ్లారు.
అదేవిధంగా ఉట్నూర్ పట్టణం తోపాటు పలుతాండాలకు చెందిన భక్తులు, బంజారా నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. తరలి వెళ్ళిన వారిలో సంతు సేవాలాల్ జయంతి ఉత్సవ సమితి అధ్యక్షులు రాథోడ్ భీమ్రావు లంబాడ జేఏసీ నాయకులు భానోత్ జగన్నాయక్, నేతవత్ రాందాస్, భానోత్ రామారావు, ఉట్నూర్ సాహితీ వేదిక అధ్యక్షులు బంకట్లాల్ జాదవ్ పూర్వ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ రాథోడ్, నాయకులు భక్తులు బంజారా ప్రజలు వాహనాలలో తరలి వెళ్లారు.
