బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలు:

భారత్‌తో సంబంధాలు మారబోతున్నాయా?
షేక్ హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాలో నాటకీయ మార్పులు
తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ వ్యాఖ్యలపై చర్చ
ఎన్నికల్లో విజయం సాధించిన తారిఖ్ వైఖరి ఎలా ఉండబోతోంది?
భారత్–బంగ్లా సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా?
భారత్ విదేశాంగ విధానంపై విశ్లేషకుల అభిప్రాయాలు
రాజకీయ విశ్లేషకుడు చలసాని తో ఆంధ్రప్రభ డిజిటల్ ప్రత్యేక ఇంటర్వ్యూ
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్…మన పొరుగున ఉన్న చిన్న దేశం.అంతే కాదు, అంతర్యుద్దాలతో అట్టుడికిన పాక్ నుంచి భారత్ చొరవతో విడివడి అవతరించిన స్వతంత్ర దేశం..అనేక సందర్భాలలో భారత్ నుంచి, ఆర్ధికంగానే కాక అంతర్జాతీయంగా నైతిక స్థైర్యాన్ని కూడా పొందిన దేశం…కొంతకాలం క్రితం బంగ్లాలో చెలరేగిన హింసా కాండ ఆ దేశ అధ్యక్షురాలు షేక్ హసీనాను అక్కడి నుంచి పారిపోయి మనదేశంలో తలదాచుకునేలా చేసింది… ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలలో తాత్కాలిక అధ్యక్షుడుగా గద్దెనెక్కిన యూనస్..భారత్ పై అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు…
ఎన్నికల ప్రక్రియ పూర్తయి, తాను గద్దె దిగి పోతూ, తారిఖ్ ప్రమాణ స్వీకారానికి ముందు కూడా భారత్ ప అనుచిత వ్యాఖ్యలు చేసారు. మరి ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకొచ్చిన తారిఖ్ ఆలోచనలెలా ఉండబోతున్నాయి? భారత్ తో బంగ్లా వైఖరి మారబోతుందా? అసలు బంగ్లా విషయం పక్కన పెడితే మిగతా దేశాలతో ఈ మన సఖ్యత ఎలా ఉంది? మన విదేశాంగ విధానం సరిగ్గానే ఉందా? రాజకీయ విశ్లేషకులు చలసాని తో ఆంధ్రప్రభ డిజిటల్ ప్రత్యేక ఇంటర్వ్యూ… అనేక ఆసక్తికరమైన విశేషాల కోసం ఈ క్రింది వీడియో చూడండి.
