Bangalore | ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం..

Bangalore | ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం..
Bangalore | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : కర్ణాటకలోని శివమొగ్గ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. శివమొగ్గ జిల్లాలోని హోసనగర నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ నాన్-ఏసీ స్లీపర్ బస్సు గత రాత్రి (జనవరి 27, 2026) హోసనగర తాలూకాలోని సుదూర్ సమీపంలో అగ్నిప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. 36 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు సుదూర్‌కు చేరుకుంటున్న సమయంలో డ్రైవర్ క్యాబిన్‌లో పొగలు కనిపించాయి. భయాందోళనకు గురైన డ్రైవర్ రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో బస్సును ఓ చెట్టును ఢీకొట్టి ఆపినట్లు సమాచారం. ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
