ఆలయ కమిటీ సభ్యుడిగా బండారు శ్రీనివాసరావు

ఖమ్మం, ఆంధ్రప్రభ : నగరంలోని కమాన్ బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యుడిగా నగరానికి చెందిన బండారు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన సభ్యుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుమ్మల గారి ఆశీస్సులతో, కమర్తపు మురళి అన్న సూచనలతో ఖమ్మం కమాన్ బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. దేవస్థానం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
