కాఫ్ సిరప్‌లపై నిషేధం

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మ‌రో కీల‌క నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు కాఫ్ సిరప్ (Caffeine Syrup)లపై నిషేధం విధించింది. బ్యాన్‌కు గురైన కాఫ్ సిరప్‌లలో రీలైఫ్, రెస్పిఫ్రెష్-టీఆర్‌ సిరప్‌లు ఉన్నాయి. అయితే, ఈ రెండు దగ్గు మందులను మెడికల్ స్టోర్‌లలో ఎవరూ విక్రయించొద్దంటూ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ‘కోల్డ్‌రిఫ్’ కాఫ్ సిరప్ సేవించిన కారణంగా 11 మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అప్రమత్తమైంది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ (DEG) కలుషితం ఉన్న SR-13 బ్యాచ్ సిరప్‌ను ఉపయోగించవద్దని డీసీఏ అడ్వైజరీ చేసింది. రాష్ట్రంలోని మెడికల్ స్టోర్‌లు ఆసుపత్రులలో ఆ బ్యాచ్ సిరప్‌లను సీజ్ చేయాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మరో రెండు సిర‌ప్‌ల‌ను విక్ర‌యించ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply