ballot box | పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో సిబ్బంది…

ballot box | పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో సిబ్బంది…

ballot box | దండేపల్లి, ఆంధ్రప్రభ : రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది, సామాగ్రిని పోలింగ్ కేంద్రాల(Polling centers)కు తరలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్(polling) సిబ్బందికి సామాగ్రిని అందజేశారు. 26 గ్రామపంచాయతీల సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతుండటంతో బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్(ballot box)లు, ఎన్నికలకు వినియోగించే సామాగ్రి పోలింగ్ అధికారులకు అందించారు.

ఎన్నికల సామాగ్రిని తీసుకొని పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో జాగర్లమూడి ప్రసాద్, ఎంఈఓ మంత్రి రాజు, మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply