Balkonda | ‘ఆంధ్రప్రభ ‘ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సిఐ

Balkonda | ‘ఆంధ్రప్రభ ‘ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సిఐ

Balkonda | బాల్కొండ, ఆంధ్రప్రభ : గత 88ఏళ్ళుగా పాఠకుల హృదయాల్లో ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక ఎంతగానో ఆకట్టుకుంటూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక పనిచేస్తుందని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇవాళ‌ ‘ఆంధ్రప్రభ’ దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్ ను నిజామాబాద్ జిల్లా బాల్కొండ లోని సర్కిల్ కార్యాలయంలో ఎస్సై శైలేందర్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.

88 సంవత్సరాల నుండి 89 సంవత్సరంలో అడుగుపెట్టిన ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలసమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తుందని గుర్తు చేశారు. ‘ఆంధ్రప్రభ’లో వస్తున్న పలు శీర్షికలు చదవడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయని తెలిపారు. ‘ఆంధ్రప్రభ’ దినపత్రికతో పాటు స్మార్ట్ ఎడిషన్, యూట్యూబ్ ఛానల్, వెబ్ న్యూస్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేరుస్తున్నారని తెలిపారు.

‘ఆంధ్రప్రభ’యజమాన్యం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. విభిన్న కథనాలతో ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక ప్రజల్లోకి వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు . పోలీస్ శాఖ తరపున ఆంధ్రప్రభ దినపత్రిక యాజమాన్యనికి, సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వాసుదేవ్,కానిస్టేబుల్స్ భరత్ గౌడ్,రైటర్ కైలాష్ పతి, ప్రశాంత్, ఆంధ్రప్రభ రిపోర్టర్ శివప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply