Balayya | అఖండ 3 నిజంగా ఉంటుందా..?

Balayya | అఖండ 3 నిజంగా ఉంటుందా..?

Balayya, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌(Combination)లో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళుతుంది. అయితే.. ఫస్ట్ డే బాలయ్య కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్(Highest Collection) సాధించిన సినిమాగా అఖండ 2 నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 వచ్చింది. ఇప్పుడు అఖండ 2 కు సీక్వెల్ గా అఖండ 3 ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి.. నిజంగా అఖండ 3 ఉంటుందా..? దీని గురించి నిర్మాతలు ఏమన్నారు..?

అఖండ 2 కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజే 59.5 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ అఫిషియల్(Makers Official) గా అనౌన్స్ చేశారు. ఈ భారీ వసూళ్లతో బాలకృష్ణ తన కెరీర్‌లోనే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్(First Day Collections) సాధించిన చిత్రంగా అఖండ 2 నిలిచింది.. బాలయ్యకు సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి ఈ మొత్తం వసూలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్ల‌స్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ వీకెండ్ లో మరింత ఎక్కువుగా కలెక్షన్స్ సాధించే దిశగా అఖండ 2 దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమాకి విశేషాదరణ(special attention) లభిస్తుందని మేకర్స్ తెలియచేశారు.

Balayya

Balayya | అదిరిపోయే సర్‌ప్రైజ్

ఇదిలా ఉంటే.. ఈ సినిమా చూసిన అభిమానులకు బోయపాటి చివర్లో ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్(Surprise) ఇచ్చారు. ఈ సిరీస్‌లో మూడో భాగం కూడా రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. జై అఖండ పేరుతో అఖండ 3 ఉంటుందని ప్రకటించడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందం రెట్టింపు అయింది. ఇప్పటి వరకు బాలయ్య, బోయపాటి కలిసి సింహ, లెజెండ్, అఖండ, అఖండ 2 చేశారు. ఈ సినిమాలు సక్సెస్(Movies success) సాధించడంతో ఈ కాంబోకు భారీగా క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో పవర్‌ఫుల్ సినిమా రావడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

ఇదే విషయం గురించి అఖండ 2 నిర్మాతలను అడిగితే.. అఖండ 3 గురించి.. బోయపాటే చెప్పాలి అన్నారు. అయితే.. ఈ మూవీ డిసెంబర్ 5న రాకుండా ఆగిపోవడం.. ఆతర్వాత డిసెంబర్ 12న(On December 12th) రిలీజ్ అవ్వడం.. తెలిసిందే. బాలయ్య, బోయపాటి తమ రెమ్యూనరేషన్ కూడా వదులుకుని ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సహకరించారు. అందుచేత.. ఈ నిర్మాతలతో బాలయ్య, బోయపాటి అఖండ 3 చేస్తారా..? అనే డౌట్ సినీ అభిమానుల్లో ఏర్పడింది. అంతే కాకుండా.. ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్(responce) రాలేదనే టాక్ కూడా ఉంది. ఈ నేపధ్యంలో అఖండ 3 ఉండదేమో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. అఖండ 3 గురించి క్లారిటీ రావాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే..

Balayya

CLICK HERE TO READ పోలింగ్ కేంద్రాల్లో పచ్చదనం..

CLICK HERE TO READ MORE

Leave a Reply