ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వినాయక నిమజ్జనోత్సవం (Vinayaka Immersion Festival) రోజున భాగ్యనగరంలో బాలాపూర్ (Balapur) గణేశుడి లడ్డూ వేలం (Laddu Auction) పాటపైనే అందరి దృష్టి ఉంటుంది. ప్రతీ ఏడాది ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డు వేలం పాటపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గణేశుడి లడ్డూ (Ganesh Laddu) వేలం పాటకు చాలామంది పోటీపడుతుంటారు.
31 ఏళ్లుగా కొనసాగుతున్న బాలాపూర్ లడ్డూకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. గతేడాది రూ.30.01 లక్షలు పలకగా… ఈ ఏడాది ఏకంగా రూ. 35 లక్షలతో రికార్డులు బద్దలు కొట్టింది. రూ.450తో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ.లక్షలకు చేరుకుంది. ఈసారి 38 మంది వేలం పాటలో పాల్గొన్నారు.