Bala Sadanam | చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ అనుబంధం

Bala Sadanam | చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ అనుబంధం

  • బాలసదనంను సందర్శించిన జిల్లా కలెక్టర్

Bala Sadanam | ఆళ్లగడ్డ, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ పట్టణంలోని బాల సదనంను (Children Home) ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సందర్శించి అక్కడ ఉన్న చంటి పిల్లలతో ప్రేమగా, ఆత్మీయతతో ముచ్చటించి వారి శుభాకాంక్షలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడి పిల్లల సంక్షేమంపై వివరాలు తెలుసుకుని అందిస్తున్న సదుపాయాలు నివాసం, విద్య, పోషక ఆహారంపై అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులు(Children’s health conditions) వారు పొందుతున్న సంరక్షణ, శుభ్రత పరిస్థితులను పరిశీలిస్తూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

బాల సదనంలోని చిన్నారులతో కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి(Warm greetings) వారి అవసరాలు, చిన్న కోరికలను తెలియజేసుకోవడంతో పాటు పిల్లలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను కలెక్టర్ తిలకించారు. బాధ్యతతో చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అమృత్ పథకం(Amrit Scheme) క్రింద ఆర్ఫన్ చిల్డ్రన్ హోమ్ చంటి పిల్లలకు ఎన్టీఆర్ వైద్య సేవ హెల్త్ కార్డు(Medical Service Health Card)లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి లీలావతి, సంబంధిత అధికారులు ఉన్నారు.

Leave a Reply