Bakki Venkataiah | ప్రజాసేవకు యువత అంకితం కావాలి…

Bakki Venkataiah | ప్రజాసేవకు యువత అంకితం కావాలి…
- రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య…
Bakki Venkataiah | బిక్కనూర్, (ఆంధ్రప్రభ) : యువత ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. శనివారం మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు తొగరి రమేష్ ఆయనను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈసందర్భంగా వాటి సభ్యులు రమేష్ ను ఆయన అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ… చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని గుర్తు చేశారు. వారికి అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత రాజకీయాల్లో రాణించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.
