RUN | 2కే రన్ ప్రారంభించిన భజరంగ్ దల్
RUN | నర్సంపేట, ఆంధ్రప్రభ : మత్తు రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు చేయి చేయి కలపాలని బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు (Shivaramulu) అన్నారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దల్ నర్సంపేట ఆధ్వర్యంలో ‘నషా ముక్త యువ వికసిత భారత్ అభియాన్’ 2కే రన్ బుధవారం నిర్వహించారు. భారీ సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, యువకులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని పాకాల రోడ్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు జాతీయ జెండాలను, మత్తు నిర్మూలన అవగాహన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ధూమపానం, మధ్యపానం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలన చేద్దామంటూ సమాజంలో చైతన్యం తీసుకువచ్చే విధంగా నినాదాలు చేశారు.
అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా తమ కుటుంబాలని, మిత్రులను, బంధువులను, సమాజాన్ని కాపాడుకుంటా మని ప్రతిజ్ఞ చేశారు. బజరంగ్ దల్ (Bajrang Dal) రాష్ట్ర కన్వీనర్ శివరాములు మాట్లాడుతూ మన దేశ అస్థిత్వానికి, అభివృద్ధికి యువతే మూలమని, వారే భవిష్యత్తులో దేశాన్ని సమాజాన్ని నడిపించేవా రిని, మన దేశాన్ని అణిచి వేయాలని విదేశీ సంస్థలు కుట్రపూరితంగా అనేక రూపాల్లో మత్తు పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తూ యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నాయని ఆరోపించారు. ఈ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కుని నషాముక్త భారత్ ని సాధిద్దామన్నారు. నషాముక్త యువ వికసిత భారత్ కార్య క్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
విశ్వహిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి మల్యాల రవి మాట్లాడుతూ ప్రతీ కళాశాలలు, విద్యాలయాల్లో నషాముక్త భారత్ కార్యక్రమాలు చేపట్టి యువతలో డ్రగ్స్, మత్తుపదార్థాల (Narcotics) అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం మత్తుపదార్థాల నిషేధం, అక్రమ విక్రయాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట అధ్యక్షుడు చోల్లేటి జగదీశ్వర్, సహా కార్యదర్శి నరేందర్, కోశాధికారి సుదర్శన్, గో రక్ష ప్రముఖ్ నాగార్జున, బజరంగ్ దళ్ కన్వినర్ చరణ్, శోభన్, చందు లతో పాటు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

