Baby Girl | చంటి పాపతో వచ్చి.. ఓటేసి..
Baby Girl | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన తుది విడత పంచాయతీ పోలింగ్ లో పల్లె ఓటర్లు పోటెత్తారు. ఉదయం 11 గంటలకు 56% పోలింగ్ నమోదైంది. చలిని లెక్క చేయకుండా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో చంటి పాపని ఎత్తుకొని వచ్చి అంజలి అనే ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో పోలింగ్ కేంద్రంలో చంటి బాబుతో వచ్చిన మహిళా ఓటరు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా… అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆ బాబును ఎత్తుకొని సహాయంగా నిలిచారు.

