B.b.raj Pally | నిరంతరం కృషి చేస్తా..

B.b.raj Pally | నిరంతరం కృషి చేస్తా..

B.b.raj Pally, గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి మండలంలోని బీబీ రాజుపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో దొనకొండ తిరుపతికు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని, ప్రజా సేవ చేసుకునే ఒక్క అవకాశం కల్పించాలని ప్రచారం నిర్వహించారు. గ్రామంలో తాగునీటి, వీధి దీపాలు, డ్రైనేజీ శుభ్రపరచడం, ప్రజా ఆరోగ్య వ్యవస్థ పై చర్యలు తీసుకోవడం, అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తాను అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని చెప్పారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి గ్రామంలో దూసుకెళుతున్నారు.

Leave a Reply