హైదరాబాద్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్ది సేపు ముచ్చటించారు . వారి మధ్య ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్‌పై చర్చ జరిగింది. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని సీఎంను అజారుద్దీన్ కోరినట్లు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డితో అజారుద్దీన్ భేటీ
