ఎల్లుండి ప్రమాణస్వీకారం

ఎల్లుండి ప్రమాణస్వీకారం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో కేబినెట్ (Telangana cabinet) విస్తరించే అవకాశం ఉంది. బహుశ ఎల్లుండి కొత్త మంత్రులు ప్రమాణాస్వీకారం చేసే ఛాన్స్ ఉంది. ఈ సారి విస్తారణలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ కీలకనేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, అనంతరం మంత్రి పదవి లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టపెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓట్లుతో కాంగ్రెస్ పడే అవకాశం ఉందని అధిష్టానం భారీ ప్లాన్ చేసిందని సమాచారం. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రమాణాస్వీకారం ఉంటుందని సమాచారం.
