Ayyappa Swamy | పడిపూజోత్సవం..

Ayyappa Swamy | పడిపూజోత్సవం..
Ayyappa Swamy, గోదావరిఖని, ఆంధ్రప్రభ : అయ్యప్ప స్వామి పడిపూజోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని (Godavarikhani) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అయ్యప్ప స్వామి దివ్య పదునెట్టాంబడి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహా పడిపూజ ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప స్వామి మాలదారుల భజనలతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

