ఆర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ సంచలనం సృష్టించాడు. కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట ఆయూష్ మాత్రం వరుస విజయాలతో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.
ఈరోజు (శుక్రవారం) జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆయూష్ శెట్టి 21-16, 21-23, 21-17 తేడాతో డెన్మార్క్ స్టార్ ప్రపంచ 31వ ర్యాంకర్ రాసమ్యూస్ గెమ్‌కేపై సంచలన విజయం సాధించాడు.
హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత యువ షట్లర్ పూర్తి ఏకగ్రతతో ఆడుతూ ప్రత్యర్థి షట్లర్‌కు చుక్కలు చూపించాడు. గంట 21 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి దర్జాగా సెమీస్‌లోకి ప్రవేశించాడు.