ఆయుర్వేదిక్ డాక్ట‌ర్‌ సయ్యద్ స‌స్పెన్ష‌న్‌

యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాల‌ని క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు అన్నారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట ఏరియా ఆసుపత్రిని ఆయ‌న‌ ఆకస్మిక తనిఖీ చేశారు. విధులకు అనధికార గైర్హాజర్ అయిన డాక్టర్ లపై చర్యలు తీసుకొనున్నట్లు చెప్పారు. విధుల‌ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న‌ఆయుర్వేదిక్ డాక్టర్ సయ్యద్ నుస్రత్ ని ఆయ‌న స‌స్పెండ్ చేశారు. అలాగే డాక్టర్ రజిని కుమారి, డాక్టర్ వీరన్నలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, అనధికారికంగా విధులకు హాజరు కాని వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ఆసుపత్రి లో ఎమర్జెన్సీ వార్డులను కలియ తిరిగారు, వార్డు లలో పరిశుభ్రంగా లేనందున శానిటేషన్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బంది ని హెచ్చ‌రించారు.

Leave a Reply