Ayodhya | నంద్యాలలో అయోధ్య రామ మందిరం..

Ayodhya | నంద్యాలలో అయోధ్య రామ మందిరం..
Ayodhya | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : అయోధ్యలో శ్రీరాముని విగ్రహాన్ని చెక్కిన శిల్పికి ప్రధాన మంత్రి సన్మానం చేసి గౌరవించారు. అయోధ్యలో శ్రీరాముడు విగ్రహాన్ని కనులారా చూసిన వారందరూ ఆ శిల్పి నైపుణ్యాన్ని కీర్తిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అయోధ్య రామ మందిరం ఏర్పాటు చేశారు. అయోధ్యలో నిర్మాణం చేసిన శ్రీరామ మందిరాన్ని అందరూ చూడాలంటే.. ఖర్చుతో కూడుకున్న పని. అయోధ్య శ్రీరామ మందిరాన్ని పోలిన అయోధ్య రామమందిరాన్ని నంద్యాలలో ఏర్పాటు చేయటం విశేషం. ఓ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఆరు నెలలు కష్టపడి అలాంటి నిర్మాణం ఏర్పటు చేయడంతో.. ఆ అయోధ్య రాముడిని చూసినట్టు భక్తులు తరిస్తున్నారు.

అయోధ్యకు వెళ్లలేనివారు ఎందరో ఇక్కడ ఆ శ్రీరాముడిని చూసినట్టు సంబరపడుతున్నారు. శ్రీరాముడి ఆశీస్సులతో అద్భుతాన్ని కళ్ళ ముందు చూపించారు. అందరి ప్రశంసలు పొందుతున్న నిర్వాహకుడుని భక్తులు అభినందించటం విశేషం. బాల రాముని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించటం విశేషం. ఎగ్జిబిషన్ లో అయోధ్య సెట్టింగ్, శ్రీరాముడి విగ్రహం ప్రతిష్ఠకు ప్రాణం పోశారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు శ్రీనును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. నంద్యాల ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఈ అయోధ్య రామ మందిరం నమూనాలు తిలకించి అందులో ఉన్న బాల రాముడిని దర్శించుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది.
