తడి-పొడి’ చెత్త పై అవగాహన ర్యాలీ

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భీమ్‌గల్‌ మండలంలోని పురాణిపేట్ గ్రామంలో ఆదివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మూడోరోజు గ్రామ విధిలలో, పాఠశాలలో అంగన్వాడి కేంద్రాల వద్ద బస్టాండ్, హోటల్ వద్ద “తడి-పొడి”చెత్త పై అవగాహన ర్యాలీ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ వార్డ్ మెంబర్, పరిశుద్ధ సిబ్బందికి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి వారికి విమెన్ ఎంపౌరుమెంట్ గుర్తింపుగా శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర సుమలత దేవేందర్ గౌడ్, ఉపసర్పంచ్ గోవింద్.హరిక్రిష్ణ, పంచాయతీ కార్యదర్శి జితేందర్, వార్డ్ మెంబెర్లు దైడి.సురేష్, దైడి. భార్గవి, దైడి.రవి, సాంగు. సాయికుమార్, సీరం.శ్యామల, ఒడ్డెమ్ సంధ్య,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తోట.శివక్రాంతి, తోట.హరీష్ ఆశ వర్కర్స్, కరోబర్, పారిశుద్ధ్య సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply