Municipal | చెత్త సేకరణపై అవగాహన

Municipal | హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఆస్కి సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండ పరిధిలోని వాలంటీర్లు(Volunteers), సానిటరీ జవాన్లు, ఔత్సాహిక మహిళా సంఘ సభ్యులు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు తడి-పొడి చెత్త(Wet-dry garbage) సేకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి హాజరయ్యారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ సీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్‌ఓ డా.రాజేష్, టీఎంసీ వెంకట్ రెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్లు నరేందర్, గోల్కొండ శ్రీను, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఇతరులు పాల్గొన్నారు.

ఈ అవగాహన కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా తడి-పొడి చెత్తను విడదీసి సేకరించే విధానం(Method of collection)లో సమన్వయం, సామర్థ్యం పెంచడం లక్ష్యం(the goal)గా నిర్వహించినట్టు తెలుస్తోంది. వరంగల్ నగరంలో స్వచ్ఛతా కార్యక్రమాలకు ఇది మరింత ఊతం ఇస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply