పాఠశాలలలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

పాఠశాలలలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు అగ్నిమాపక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతిప్రాలన 99 రోజుల ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు పరకాల అగ్నిమాపక కేంద్రం పరిధిలో అగ్నిమాపక అధికారి పరకాల వి భద్రయ్య ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని పాఠశాలలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమాన్ని తేదీ: 06-03-2026 నుండి తేదీ:18-06-2026 వరకు మొత్తం 12 పాఠశాలలో అవగాహన కల్పించడం జరిగింది.

వీటిల్లో భాగంగా ఇంటిలో ప్రధానంగా జరిగే అగ్ని ప్రమాదాలు రెండు రకాలు 1: గ్యాస్ ద్వారా,2: విద్యుత్ ద్వారా వీటి నివారణ చర్యలను విద్యార్థులకు అవగాహన కల్పించి, దేశం సంపదను కాపాడుటలో అందరూ సామాజిక స్పృహ కలిగే ఉండాలని తెలియజేశారు. దీనిలో భాగంగా జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్, విద్యాలయ హై స్కూల్, కేజీబీవీ స్కూల్ శాంపేట, పరకాల టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ గర్ల్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, పరకాల బిట్స్ స్కూల్, పరకాల ఆక్స్ఫర్డ్ స్కూల్, పరకాల లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో విద్యార్థులను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది కె.వి.ఎన్ చారి ( ఎల్ ఎఫ్ ఎఫ్) పి.కృష్ణ కుమార్( ఎల్ ఎఫ్ ఎఫ్ ),కే.సత్తయ్య (ఎఫ్ ఎఫ్ టి) , జె.గణేష్( ఎఫ్ ఎఫ్ టి), జి. శ్రీకాంత్ ( ఎఫ్ ఎఫ్ ),డి.అజయ్ కుమార్( ఎఫ్ ఎఫ్), సి.హెచ్.దిలీప్( ఎఫ్ ఎఫ్), డి. రాజేందర్ ప్రసాద్( ఎఫ్ ఎఫ్ ) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply