కమ్మర్ పల్లి, సిరికొండ,ఇందల్వాయి రేంజ్ ల సిబ్బందికి అవగాహన

కమ్మర్ పల్లి, సిరికొండ,ఇందల్వాయి రేంజ్ ల సిబ్బందికి అవగాహన

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : ప్రజలను వణికిస్తున్న పెద్దపులిని పట్టుకోవడానికి పూనే రెస్క్యూ టైగర్ టీం శనివారం రంగంలోకి దిగింది.ఇటీవల కమ్మర్ పల్లి అటవీ రేంజ్ లోని కొనాపూర్ ఇనాయత్ నగర్,గట్టుపొడిచిన వాగు ,భీమ్ గల్ మండలంలోని దేవక్కపేట్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరించినట్లు ట్రాకింగ్ బృందాలు గుర్తించాయి.

ఈ క్రమంలో ప్రజలకు, పులికి ఎలాంటి హానీ జరగకుండా అటవీ శాఖ చర్యలు చేపట్టింది.కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో పూణే టైగర్ రెస్క్యూ టీం,హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ వెటర్నరీ డాక్టర్ కమ్మర్ పల్లి,సిరికొండ,ఇందల్వాయి రేంజ్ ల సిబ్బందితో కలిసి సమీక్షిస్తున్నారు.

రిజర్వ్ ఫారెస్ట్ లోపల లేదా వెలుపల టైగర్ మూమెంట్ కనిపించినప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు,టైగర్ మూమెంట్ ను ఎలా గుర్తించాలి,దాని స్థానాలను గుర్తించడం ద్వారా ట్రాప్ కెమెరాను ఎలా అమర్చాలి,టైగర్ ను ఎలా ప్రశాంత పరచాలి,ప్రదేశాలను గుర్తించి ఫగ్ మార్కులను ఎలా గుర్తించాలి, రెస్క్యూ టీం గత 6 నెలల నుండి పులిని పట్టుకోవడానికి పని చేస్తున్నప్పుడు పులి ప్రవర్తన గురించి,పులి పశువుల పై దాడి చేసినప్పుడు లేదా చంపినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ ముందు జాగ్రత్త చర్యలు పై సిబ్బందికి అవగాహన కల్పించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని,పొలాలకు వెళ్లేవారు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ఈ సమావేశంలోఎఫ్ ఆర్ వో రవీందర్,సిబ్బంది , బేస్ క్యాంప్ వాచర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply