Awareness | జీవన ఎరువులు వినియోగించు విధానంపై అవగాహన

Awareness | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామంలో కే.వీ.కే సమన్వయ కర్త డా.డి.సుధారాణి వివిధ పంటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం అవగాహన వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. రసాయన ఎరువులతోపాటు పచ్చి రొట్ట ఎరువులు, సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు వినియోగించు విధానాన్నీ రైతులకు అవగాహన కల్పించారు.
సస్యపోక్షణ శాస్త్రవేత్త డా. వెంకట లక్ష్మీ మాట్లాడుతూ పచ్చి రొట్ట ఎరువులు, పశువుల ఎరువు వేయడం వలన నేలలో సేంద్రీయ కార్బనం శాతం పెరుగుతుంది. జీవన ఎరువులు వివిధ పంటలలో తక్కువ ఖర్చుతో వరి, మినుము, కూరగాయ మొక్కలకు, ఇతర పంటలకు వినియోగించు కోవచ్చునని తద్వారా నేలలో సూష్మజీవుల సంఖ్య పెరుగుతాయి తద్వారా నేలలో ఉన్న పోషకాలు కరిగి మొక్కలకు పోషకాలు అందించడం, భూమి సారవంతం పెరగడం జరుగుతుంది వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి అనూష, అహమ్మద్ విఏఏ, రైతులు పాల్గొన్నారు.
