Awareness | రసాయనాలు అధికంగా వాడొద్దు
- కొడాలిలో రైతులకు అవగాహన కార్యక్రమం
Awareness | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండల పరిధిలోని కొడాలి గ్రామంలో జిల్లా వనరుల కేంద్రం (మచిలీపట్నం ) వారు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మినుములు విత్తన మోతాదు, విత్తన శుద్ధి పలు అంశాలపై జిల్లా పంటల కేంద్రం ఏడీఏ శ్రీనివాసరావు(ADA Srinivasa Rao) వివరించారు. తగిన మోతాదులు అవసరమైన మేరకే మందులు పిచికారీ చేయాలని తెలిపారు. భూసార పత్రం ఆధారంగా ఎరువుల వాడకం, రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకం(Use of organic fertilizers) ప్రాముఖ్యతను డీడీఏ కే.జ్యోతి రమణి తెలియజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనూష, చిన్న వ్యవసాయ కేంద్రం వ్యవసాయ అధికారులు పద్మజ, వీఏఏ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

