Awards, Rewards | హాస్యబ్రహ్మ శంకర నారాయణ రికార్డు

Awards, Rewards | హాస్యబ్రహ్మ శంకర నారాయణ రికార్డు
- సాహస కళాకారుడికి జీనియస్ రికార్డు
- అరుదుగా ఇచ్చే జీనియస్ బుక్ రికార్డు
Awards, Rewards | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హాస్యబ్రహ్మ, ప్రముఖ పాత్రికేయుడు శంకరనారాయణకు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్(Book of Records) ఇంటర్నేషనల్ సంస్థ రికార్డు లభించింది. త్యాగ రాయ గానసభ లోని కళా సుబ్బారావు కళావేదికలో త్యాగరాయ గాన సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ఈ శంకర నారాయణకు ఈ రికార్డ్ ప్రదాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన త్యాగరాయ గాన సభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్, హాస్యావధాని అయిన శంకర నారాయణ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారని ఎన్నో అవార్డులు, రివార్డులు(Awards, Rewards) సాధించారని వాటిలో అరుదుగా ఇచ్చే జీనియస్ బుక్ రికార్డు విశేషమని అన్నారు.
హాస్యబ్రహ్మ శంకరానారాయణకు ఈ రికార్డు

ఆయనకు మరిన్ని గౌరవాలు దక్కాలని ఆకాంక్షించారు. శంకర నారాయణ త్యాగరాయ గానసభ మేనేజింగ్ కమిటీలో సభ్యుడు కావడం తమకు గర్వకారణమని ఆయన అన్నారు. శంకర నారాయణలాంటి ప్రతిష్టాత్మక మయిన సాహస కళాకారుడికి జీనియస్ రికార్డును తన చేతుల మీదుగా ప్రదానం చేయడం సంతోషంగా ఉందని జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్ నేషనల్(International) ఇండియా చీఫ్ కో ఆర్డినేటర్, ప్రముఖ న్యాయవాది టి.సుభాషిణి అన్నారు.
తెలుగుభాష గొప్పతనాన్ని, మన సాహిత్యపు విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన హాస్యబ్రహ్మ శంకరానారాయణకు ఈ రికార్డు రావడం పట్ల పాటల రచయిత, ఇంటర్ నేషనల్ వండర్ బుక్ అఫ్ రికార్డ్(Wonder Book of Records) గ్రహీత రామారావు విశ్వేశ్వర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.త్యాగరాయ గానసభ తనకు కళాజన్మభూమి అని అందరితో కలుపుగోలుగా ఉండడమే తనకు గోలు అని శంకర నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు.
