Award | ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా శ్రీనివాస్

Award | ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా శ్రీనివాస్
- కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం
Award | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ కార్యదర్శి బోరుకుంట శ్రీనివాస్ జిల్లా స్థాయి ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
కన్నాల గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, తో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో శ్రీనివాస్ కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. శ్రీనివాస్ ఉత్తమ కార్యదర్శిగా ఎంపికవ్వడం పట్ల బెల్లంపల్లి మండల అధికారులు, కన్నాల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.
