Award| జాతీయ గుర్తింపు గురు రత్న అవార్డు అందుకున్న అమీనాపూర్ వాసి

Award| జాతీయ గుర్తింపు గురు రత్న అవార్డు అందుకున్న అమీనాపూర్ వాసి

వేల్పూర్,ఆంధ్రప్రభ: తమ బోధనా విధానాల్లో నూతన ఆవిష్కరణలతో విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామ నివాసి డంగు రాజలింగం ను ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇన్నోవేటివ్ టీచింగ్ అనే అవార్డుకు ఎంపిక చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. చెన్నైలోని ప్రముఖ విద్యాసంస్థ ఏ ఎము ఈ టి యూనివర్సిటీ డా.జె. రామచంద్రన్ మారిటైమ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 33వ ఫౌండేషన్ డే టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు. కార్యక్రమంలో 2026 సంవత్సరానికి గాను ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. దృక్పథాన్ని పెంపొందించినందుకు డంగు రాజలింగం కి ఈ గౌరవం లభించడం విశేషం.ఈ గుర్తింపు ఉపాధ్యాయ వృత్తి మహత్వాన్ని మరోసారి చాటిందని విద్యావర్గాలు ప్రశంసిస్తున్నాయి.

Leave a Reply