Avanigadda | గ్రామస్థుల సన్మానం
Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ప్రశంసనీయులని బర్రంకుల గ్రామస్థులు అన్నారు. తమ గ్రామానికి ప్రధాన రహదారి మంజూరు చేయించిన సందర్భంగా శుక్రవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాదును వారి కార్యాలయంలో కలిసి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ బర్రంకుల – నాలి ప్రధాన రహదారి 4.548 కిలోమీటర్ల మేరకు నిర్మాణానికి సాస్కి నిధుల నుంచి రూ.2.50 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ రోడ్డు సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాదుకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త గోపాలం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు, మండలి వెంకట్రామ్, బర్రంకుల సొసైటీ చైర్మన్ తోట శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పిరాటి శిరీష, కమతం నరేష్, పిరాటి బలరాం, తోట కొండలు, తోట రత్నారావు , బర్మా సత్యన్నారాయణ, బర్మా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

