సీజ్ చేసిన ఇసుక వేలం..

భీమ్‌గల్ రూరల్, (ఆంధ్రప్రభ): భీమ్‌గల్ తహసీల్దార్ పరిధిలోని గోన్‌ గొప్పుల గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 95 ట్రిప్పుల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. గ్రామంలోని హరిహర రైస్‌మిల్ వద్ద ఇసుక నిల్వ ఉందని సమాచారం రావడంతో, తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్ ఆదేశాల మేరకు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లు సాయగౌడ్, మల్లేష్, పోలీస్ సిబ్బందితో కలిసి సీజ్ చర్య చేపట్టారు.

సీజ్ చేసిన ఇసుకను ఈ నెల 10న రెవిన్యూ అధికారుల సమక్షంలో వేలం వేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.10,000 డిపాజిట్ చేయాలని, వేలంలో పాల్గొని ఇసుక దక్కించుకోని వారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఆసక్తిగల వ్యక్తులు వేలంలో పాల్గొనాలని తహసీల్దార్ షబ్బీర్ కోరారు.

Leave a Reply