దాగుడుమూతలాడుదామని అత్యాచార యత్నం..

దాగుడుమూతలాడుదామని అత్యాచార యత్నం..

  • తొమ్మిదేళ్ళ బాలిక పై అత్యాచార యత్నం
  • పక్కింటి యువకుడి కీచక పర్వం
  • సర్కస్ చూసేందుకు బయటకు వచ్చిన బాలిక
  • బాలిక కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు
  • యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగింత
  • మెదక్ జిల్లా సికింద్లపూర్ లో ఘటన

శివ్వంపేట, ఆంధ్రప్రభ : నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ళ బాలిక పై అత్యాచార యత్నం జరిగింది. సర్కస్ చూసేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలిక పై కన్నేసిన పక్కింటి యువకుడు కీచక పర్వానికి తెరలేపాడు. దాగుడు మూతలు ఆడుదామని మాయమాటలు చెప్పి దుశ్చర్యకు పాల్పడ్డాడు. పసిగట్టిన బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.

యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ళ బాలిక మంగళవారం రాత్రి సర్కస్ చూసేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది.

అదే గ్రామానికి చెందిన పక్కింటి యువకుడు చేగురి ఆంజనేయులు(20) బాలిక పై కన్నేసి మాటలు కలిపాడు. దాగుడు మూతలాట ఆడుదామని మాయమాటలు చెప్పిన యువకుడు తన అమ్మమ్మ ఇంటి పరిసరాలకు బాలికను తీసుకెళ్లినట్లు తెలిపారు. బలవంతంగా బట్టలు విప్పుతుండగా పసిగట్టి బాలిక కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబీకులు అప్రమత్తమయ్యారు.

యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడి పై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు.

Leave a Reply