మంత్రి ఓఎస్డీ అరెస్టుకు య‌త్నం..

హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం రాత్రి తీవ్ర హైడ్రామా నెలకొంది. ఆమె ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్ కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రయత్నించగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మంత్రి ఇంట్లో ఓఎస్డీ సుమంత్ తలదాచుకున్నాడని.. సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలోని మంత్రి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అయితే, పోలీసులు అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించడంతో మంత్రి కుటుంబ సభ్యులు పోలీసుల అడ్డుకున్నారు.

సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటో వివరించాలని మంత్రి కుమార్తె సుస్మితా పటేల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఇదిలా ఉండగా, అటవీ శాఖలో బదిలీలు, డిప్యుటేషన్లు సుమంత్ ప్రభావంలో జరిగేవన్న ఆరోపణలు ఉన్నాయి. తన పదవికి మించిన అధికారం వాడుకుని, ఐఏఎస్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసే స్థాయికి ఎదిగాడని సమాచారం.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను విధుల నుంచి టెర్మినేట్ చేసింది. ఈ మేర‌కు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. సుమంత్ టెర్మినేషన్‌తో మంత్రి కొండా సురేఖ వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. అనంతరం ఆయన అరెస్టుకు ప్రయత్నాలు జరగడంతో ఈ పరిణామం రాజకీయంగా హీటెక్కింది.

Leave a Reply