వైద్యులపై దాడులు ఆపాలి….

హనుమకొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో శనివారం నల్లబ్యాడ్జీలతో శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. వైద్యులపై దాడులు వెంటనే ఆపివేయాలన్నారు. డాక్టర్లను అమానుషంగా కొట్టిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులకు వైద్య సేవలు అందించలేమన్నారు. వైద్యులు ప్రాణాలు కాపాడాలని మాత్రమే చూస్తారు తప్ప, ప్రాణాలు తీయాలని అనుకోరు. ప్రమాదవశాత్తూ ప్రాణం పోగానే నిజానిజాలు తెలుసుకోకుండా, వైద్యుల శ్రమను అర్థం చేసుకోకుండా చేయి చేసుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యుల పట్ల రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. లేని యెడల వైద్యం చేయడం కష్టంగా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు నిర్వహిస్తే, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అలాగే వైద్యుల రక్షణ కొరకు చట్టాన్ని కఠిన పరచాలని కోరారు. అమానుషంగా దాడులకు పాల్పడితే నేరస్తులపై శిక్షను 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు పెంచాలి, ద్వంసమైన ఆసుపత్రుల ఆస్తి నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply