గ్రామ పాలనాధికారిపై దాడి అమానుషం

ఆలేరు, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ పాలన అధికారి భూపాల్ క్షేత్రస్థాయి విచారణకు వెళ్లగా జరిగిన దాడి అమానుషమని తెలంగాణ గ్రామ పాలన అధికారుల సంఘం రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ శనివారం చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలను చట్టపరంగా తీసుకోవాలని ఆయన చెప్పారు.
