Attack | తీన్మార్ మ‌ల్ల‌న్న కార్యాల‌యంపై దాడి – గాలిలోకి కాల్పులు

హైదరాబాద్ | మేడిపల్లిలోని తీన్మార్‌ మల్లన్న (teenamar mallanna ) ( ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్) కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు (jagruthi followers ) కార్యాలయంపై దాడి (attack ) చేశారు. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితపై (mlc kavitha) అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి నాయకులు దాడికి దిగారు. ఈ క్రమంలో మల్లన్న గన్‌మెన్ (gunman) గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు (five rounds firing ) జరిపారు.. జాగృతి కార్యకర్తల దాడిలో మల్లన్న ఆఫీసులో ఫర్నిచర్‌ ధ్వంసం అయింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొనడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో దాడి జరిగినట్లు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపిస్తున్నారు. అయితే.. జాగృతి నేతల దాడి సమయంలో మల్లన్న ఆఫీస్ లోనే ఉన్నారు.

ఆఫీస్‌పై దాడి జరగడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా,. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply