పాక్ విమానాలు రాకుండా గగనతల మూసివేతకు అడుగులు
దాయాది దేశం చేసుకుంటున్న దిగుమతులపై కేంద్రం ఆరా
ఫార్మా ఎగుమతుల నిలపివేసేందుకు ప్రయత్నాలు
అన్ని వైపులు పాక్ ను దిగ్భంధం చేయాలని నిర్ణయం
న్యూ ఢిల్లీ – పహల్గామ్ లో టూరిస్ట్ లపై దాడి తర్వాత భారత్ పాక్ పై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నది..ముందుగా సింధూ నదీ జలాలు పాక్ కు వెళ్లకుండా బ్లాక్ చేసిన భారత్ ఆ తర్వాత వాఘా బోర్డర్ ను మూసి వేసింది. ఇక్కడకు వచ్చిన పాక్ పౌరులందర్నివెళ్లిపోవాలని ఆదేశాలిచ్చింది.. మెడికల్ ఎమెర్జెన్సీ కోసం వచ్చిన పాక్ పౌరులు నేటి రాత్రి 12 గంటల లోపు దేశాన్ని వీడాల్సి ఉంటుంది.. ఇక పాక్ యూ ట్యూబ్ ఛానల్స్, పాక్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసేసింది.. అలాగే పాక్ టి వి ప్రసారాలు భారత్ లో రాకుండా సిగ్నల్స్ ను ఆపివేసింది.. ఇప్పుడు తాజాగా జర్నలిస్ట్ లపై కేంద్రం దృష్టి సారించింది.. భారత్ మీడియా సంస్థల తరఫున పని చేస్తున్న పాకిస్తాన్ కు చెందిన కొందరు జర్నలిస్టుల ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలు బంద్ చేసింది. ఐఎస్ఐ, పాకిస్తాన్ ప్రభుత్వంతో కలిసి భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు హోల్డ్ లోకి వెళ్లాయి. అలాగే పాక్ లో ఉంటున్న పలువురు జర్నలిస్ట్ ల ఎక్స్ ఖాతాలను సైతం బ్లాక్ చేసింది. అలాగే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాతాను సైతం బ్లాక్ చేసింది.
భారత్ గగనతలం మూసివేత ?
భారత్ విధించిన ఆంక్షల నేపధ్యంలో పాక్ తన గగన తలాన్ని మూసివేసింది.. దీంతో భారత్ తో సహా పలు అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పాక్ నుంచి కాకుండా వేరే ప్రాంతం నుంచి వెళుతున్నాయి.. అయితే భారత్ మాత్రం ఇంత వరకు తన గగన తలాన్ని మూసివేయలేదు.. దీంతో పాక్ కు చెందిన పౌర విమానాలు మన గగనతలం నుంచే పయనిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన గగన తలాన్ని మూసివేసే అవకాశాలను పరిశీలిస్తున్నది.. మన గగన తలాన్ని అనేక ప్రపంచదేశాలు వినియోగించుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఈ విషయంలో అచితూచి అడుగులు వేస్తున్నది..
ఫార్మా రంగం దిగుమతులు నిలుపుదల
తాజాగా వాణిజ్య పరమైన ఆంక్షల పై భారత్ ప్రభుత్వ దృష్టి సారించింది.. పాకిస్తాన్ దిగుమతులు చేసుకుంటున్న వస్తువుల వివరాలపై ఆరా తీస్తున్నది. ముఖ్యంగా భారత్ నుంచి మెడిసిన్స్, మెడికల్ ఎక్విప్మెంట్ లు ఎక్కువుగ దిగుమతి చేసుకుంటునట్లు గుర్తించింది.. పాకిస్థాన్ ఉ మెడికల్ ఎగుమతులు నిలిపివేసే విషయంపై ఇక్కడ ఫార్మా కంపెనీలతో కేంద్రం చర్చలు జరుపుతున్నది.. త్వరలోనే దీనిపై కూడా నిర్ణయం తీసుకోబోతునట్లు సమాచారం