At China Wall Fatal Accident  :  9 మంది దుర్మరణం

At China Wall Fatal Accident  :  9 మంది దుర్మరణం

మారేడుమిల్లి చైనా వాల్​ దగ్గర దుర్ఘటన

అందరూ చిత్తూరు వాసులే

20 మందికి తీవ్రగాయాలు

సహాయక చర్యల్లో చింతూరు ఐటీడీఏ

( ఆంధ్రప్రభ, చింతూరు )

At China Wall Fatal Accident

చింతూరు మారేడు మల్లి ఘాట్ (Maridu milli ghat)  రోడ్డులో ఘోర ప్రమాదం (Fatal Accident) , 9 మంది దుర్మకణం (9 Dead Alive) , చైనా వాల్ వద్ద (Chaina wall)    ప్రైవేటు బస్సు బోల్తా (Over Turn) , శుక్రవారం తెల్లవారు ఝామున  4:30 గంటలకు ప్రమాదం.  అరకు (Araku)  నుండి భద్రాచలం రామాలయం ( Badrachalam(  కి వెళ్తుండగా దుర్ఘటన . శ్రీ విష్ణేశ్వర ట్రావెల్స్ లో ( ఏపీ 39 U M6543)  బయల్దేరిన 36 మంది చిత్తూరు (Chittooru )  వాసులు 6 వ తేదీన పుణ్యక్షేత్రాలకు చిత్తూరు నుండి వయా కొటప్ప కొండ మీదుగా ప్రారంభమైన యాత్ర . 20 మందికి ( 20 Tourists Injured )  పైగా గాయాలు . చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 108 లో క్షతగాత్రులను తరలింపు. ఘటన స్థలాన్ని కి చేరుకుని ఘటన స్థలాన్ని  ఐటిడిఎ పీవో శుభం నోక్వాల్ పరిశీలించారు. బాధితులకు సత్వర సహాయక చర్యలను పర్యవేక్షించారు.

At China Wall Fatal Accident : ప్రమాదం  .. ఇలా..

At China Wall Fatal Accident

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని చింతూరు – మారేడుమిల్లి ఘాట్‌ రోడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే ఘటనలో మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి.  వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా, బెంగుళూరుకి చెందిన యాత్రికులు ఈ నెల 6 వ తేది రాత్రి చిత్తూరు నుండి దైవ దర్శనాలతో పాటు పర్యాటక ప్రాంతాలను తిలకించేందకు బయలుదేరారు. శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్‌కి చెందిన ఏపీ 39 యూఎం 6543 ప్రైవేట్‌ బస్సులో గురువారం రాత్రి అరకు నుండి భద్రాచలం వచ్చేందకు అక్కడ నుండి బయలుదేరి వయా మారేడుమిల్లి ఘాట్‌ రోడ్‌లో వస్తుండుగా శుక్రవారం తెల్లవారుజాము సుమారు 3.15 గంటలకు ప్రమాదవశాత్తు బస్సు తులసిపాక  Tulasi Paka) గ్రామానికి సుమారు 8 కిలో మీటర్ల దూరంలోని ఘాటీలోని దుర్గమ్మ గుడికి సమీపంలోని చైనా వాల్‌ (Chaina Wall)  దగ్గర మూలమలపు వద్ద బోల్తా పడింది.

At China Wall Fatal Accident : 9 మంది అక్కడికక్కడే …

At China Wall Fatal Accident

చింతూరు – మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది యాత్రికులు మృతి చెందారు. ఈ మృతుల్లో 5 గురు మహిళలతో ( 5 Women)  పాటు మరో నలుగురు మృతి చెందారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతి చెందిన మృతులు చిత్తూరు జిల్లాతో పాటు బెంగుళూరికి చెందిన వారు ఉన్నారు. అరకు నుండి బయలుదేరి భద్రాచలం రామాలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామీ దైవ దర్శనానికి వస్తుండుగా ఘటన జరిగింది. దైవ దర్శనానికి వస్తూ 9 మంది యాత్రికులు కానరాని లోకాలకు వెళ్ళిపోయారు.

At China Wall Fatal Accident : 15 మందికి    గాయాలు

At China Wall Fatal Accident

చింతూరు – మారేడుమిల్లి ఘాటీలో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. బస్సు ప్రమాదంలో 15  మంది తీవ్ర గాయాల (15 Injured) పాలవ్వగా మరో 7 గురు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను చింతూరు (Chitoor)  సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్‌సీ)కి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు చింతూరు డీప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య, చింతూరు సీహెచ్‌సీ పర్యవేక్షణాధికారి డాక్టర్‌ కోటీ రెడ్డిల పర్యవేక్షణలో వైద్యులు ప్రధమ చికిత్సలు అందించారు.

At China Wall Fatal Accident : బస్సులో మొత్తం 37 మంది

At China Wall Fatal Accident

ప్రమాదం జరిగిన సమయంలో చిత్తూరుకి చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్‌కి ప్రైవేట్‌ బస్సులో మొత్తం 37 మంది  ( 37 in Bus) ఉన్నారు. వీరిలో బెంగుళూరుకి చెందిన వారు 12 మంది ఉండగా చిత్తూరు జిల్లాకి చెందిన 25 మంది ఉన్నారు. ఈ 37 మందిలో ఇద్దరు డ్రైవర్లతో పాటు వంట మనుషులు ఉన్నారు.

ALSO READ : KOTEKAL  DEATH CURVE |  మృత్యువు మలుపే

Leave a Reply