అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి…

అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి…
కోర్టు ముందు న్యాయవాదులు ధర్నా
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేష్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ డివిజన్ కేంద్రమైన చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రం లో అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేయాలని కోరుతూ చౌటుప్పల్ బార అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చౌటుప్పల్ కోర్టు ముందు న్యాయవాదులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బార్ సోసియేషన్ అధ్యక్షులు తాడూరి పరమేష్ మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణం జాతీయ రహదారిపై ఉన్నందున అదనపు జిల్లా న్యాయస్థానం ను చౌటుప్పల్ పట్టణంలో ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారులకు, న్యాయవాదులకు, అధికారులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపినారు.
రామన్నపేటలో అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలని అన్నారు. 60 శాతం కేసులు ఉన్న చౌటుప్పల్ జురడిక్షన్ ను కాదని కేవలం 40శాతం కేసులు ఉన్నటు రామన్నపేటలో అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేయడం వల్ల చౌటుప్పల్ కి అన్యాయం జరుగుతుందని వాపోయారు. మూడు రోజులపాటు కోర్టును బాయికాట్ చేస్తున్నామని తెలిపారు. చౌటుప్పల్ లో అదనపు జిల్లా కోర్టు ను ఏర్పాటు చేసే వరకు పోరాడుతామని పరమేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బారసోసియేషన్ ఉపాధ్యక్షులు పిట్టల బిక్షమయ్య, సహాయ కార్యదర్శి మక్టాల నరసింహ, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ దేశ గోని శ్రీశైలం, ఎగ్జిట్ కమిటీ సభ్యులు ఎండి ఖయ్యూం పాషా, మాజీ అధ్యక్షులు బాల్యం వెంకట చలపతి, ముత్యాల సత్తిరెడ్డి, బడుగు శ్రీకాంత్, జిల్లా రమేష్, జక్కర్తి శేఖర్, అవ్వారు చేతన్, పాల పరమేష్, భరత్, సుర్వి విజయ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
