మ‌హానంది, ఓంకార క్షేత్రాల్లో ఏఎస్పీ ప‌ర్య‌ట‌న‌

మ‌హానంది, ఓంకార క్షేత్రాల్లో ఏఎస్పీ ప‌ర్య‌ట‌న‌

నంద్యాల బ్యూరో నవంబర్ 5 ఆంధ్రప్రభ : జిల్లాలోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తుల రద్దీకి అనుగుణంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలతో ఏ ఎస్ పి ఎం.జావళి మహానంది పుణ్యక్షేత్రంలో పర్యటించి భక్తుల భద్రత కొరకు ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను బుధవారం పరిశీలించరు.ఈ సందర్భంగా ఏఎస్పీ జావ‌ళి బండిఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకారం,మహానంది పుణ్యక్షేత్రాలను సందర్శించి కార్తీకపౌర్ణమి సంద‌ర్భంగా సాయంత్రం జరుగబోవు కోటిదీపోత్సవం, జ్యాలతోరణం కార్యక్రమానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

క్యూలైన్లు,పంచలింగాల వద్ద ఏర్పాట్లు,విరాలకేంద్రం,కోనేరు పరిసర ప్రాంతాలు జ్యాలతోరణం జరుగు పదేశం మొదలగు ప్రాంతాలలో బందోబస్తూ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అదికారులను ఆదేశించారు. పుణ్య స్నానాలను ఆచరించడానికి విచ్చేసే భక్తులు, యువకులు పోలీసుల హెచ్చరికలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలీసులు సూచించే సూచనలు, హెచ్చరికలు ప్రజల రక్షణ, భద్రత కొరకేనని గ్రహించాలి.ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి తో పాటు తాలూకా రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి , బండిఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ , మహానంది సబ్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply