మారేడుమిల్లి (ఏఎస్ఆర్ జిల్లా), (ఆంధ్రప్రభ): అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) లోని రంపచోడవరం నియోజకవర్గ మన్యంలో ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న బాలిక మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికొన్నత పాఠశాల మారేడుమిల్లి (Maredumilli) లో ఏడవ తరగతి విద్యార్థిని చెదల.దివ్య తేజ (divya teja) (12) మృతి చెందింది. ఉదయం 7.00 గంటలకు మారేడుమిల్లి పాఠశాలలో ఆపస్మారక స్థితిలో ఉండగా, ఉపాధ్యాయులు (Teachers) స్థానిక పిహెచ్ సికి తరలించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మెరుగైన వైద్యం నిమిత్తం రంపచోడవరం (Rampachodavaram) ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.